ప్రజాపాలన పేరుకే పరిమితమైంది..

Democracy is limited in name..– బిఆర్ఎస్ సినియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్..
– ఆరు గ్యారెంటీలు, 420హామీలను అమలు చేయాలని..
– బిఆర్ఎస్  పట్టణ పార్టి ఆధ్వర్యంలో గాంధి విగ్రహానికి వినతి..
నవతెలంగాణ – వేములవాడ 
ప్రజాపాలన పేరుకే పరితమైందని, ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడం లేదని బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు గురువారం వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో గల  గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిమ్మ శెట్టి  విజయ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు  420 హామీలు వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  కాంగ్రెస్ పార్టి ఆబద్దాలతో అధికారంలోకి వచ్చి 420 రోజులైంది కానీ 4 పథకాలు కూడా అమలు కాలేదని హెద్దేవా చేశారు.  అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటి సంపూర్ణంగా అమలు చేయలేదని  అన్నారు. అలాగే రైతులకు రైతు భరోసా రూ.15000లు ఇస్తామని, రూ.12000లు ఇస్తామని చెప్పడమే కానీ కానీసం ఆ రూ.6000లు కూడా ఇవ్వకుండా రైతులని ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపారు.మొన్నటికి మొన్న 4 గ్యారంటీల ఆమలు ఆనీ లిస్ట్ లో పేర్లు చెప్పి రేషన్ కార్డు,ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మియ భరోసా,రైతు భరోసా ఆంటూ ప్రజలను గారడి చేశారే తప్ప ఏక్కడ వాటిని ఆమలు చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దరఖాస్తుల పేరిటా ప్రజలను ఆశల పల్లకీలో ఉంచి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారనీ ఆన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పథకం అమలు చేయకుండా,ప్రాజెక్ట్ లు కట్టకుండా ఈ 14 నెలల వ్యవధిలోనే ఓక లక్ష 40,000 కోట్ల అప్పు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కెసిఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చెపుతున్నారని ఆనవాళ్లు ఆంటే రైతు బంధు,రుణమాఫి,24 గంటల కరెంటు,దళితబంధు,బిసి బంధు కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలను ప్రజలకు అందించిన బిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. ఎలాంటి పథకాలను అమలు చేయకుండానే  రాక్షస ఆనందం పొందుతున్నారని తెలిపారు.కాంగ్రెస్ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో గ్రామ ఫంచీయితి,ఏంపిటిసి,జెడిపిటిసి,మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు గోలి మహేష్, నరాల శేఖర్, జోగిని శంకర్,బత్తుల దేవరాజు,కొండ కనకయ్య,మిర్యాల సంతోష్,గజ్జెల రమేష్,సంతోష్ యాదవ్, సయ్యద్ ఉమర్, మంతె సందీప్, రవిచంద్ర, హరిష్, రాకేష్, సాయిక్రిష్ణ, దేవరాజ్, సంజీవ్ తో పాటు  తదితరులు పాల్గొన్నారు.