ప్రకతి అంటూ మనం వేటిని చూస్తున్నామో…
ఆ కొండా, ఈ అపరాహ్ణమూ, కిచకిచల ఉడుతా,
పట్టూవిడుపుల ఆసక్తికర గ్రహణమూ,
ఝుమ్ ఝుమ్మనే తుమ్మెదా
కేవల మివే కాదు ప్రకతిబీ
ప్రకతి అంటే స్వర్గం!
ప్రకతి అంటూ మనం వేటిని వింటున్నామో…
ఆ పాడేపక్షిపాటా,ఈ హౌరుమనే సముద్రమూ,
గజ్జుమని అదిరించే ఉరుమూ,
కీచుకీచుమని శబ్దాలుచేసే చిమ్మెటపురుగూ,
కేవల మివే కాదు ప్రకతిబీ
ప్రకతి అంటే ధ్వనుల ఏకీకతస్వరశ్రావ్యత!
మనకేది తెలుసో
అదే ప్రకతి అని అనుకుంటున్నాం
అయినా ప్రకతి ఇదీ అనీ
ఒక్కసారిగా పూర్తిగా తెలిసిచెప్పడానికి
ఏ కళా లేదు-
అందువల్ల ఆమె నిరాడంబరసహజసౌందర్యం
ముందర
మన విజ్ఞానగరిమ శక్తిహీనం సుమా!!!
ఆంగ్ల మూల కవిత :
”Nature is what we see..” పోయమ్ బై
ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్ (1830-1886)
స్వేచ్ఛానువాదం : రఘువర్మ, 9290093933