కృష్ణ వాటర్ పైప్ లైన్ లీకేజీతోని టీచర్స్ కాలనీ అండర్ పాస్ లో నీరు వచ్చి నిల్వ ఉండడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీ బైపాస్ పక్కన ఉన్న కృష్ణ వాటర్ పైప్ లైన్ లీకేజీని, అండర్ పాస్ ను సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి, మరమ్మత్తులు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ పాస్ పైభాగాన కృష్ణ వాటర్ పైప్ లైన్ లీకేజీ కావడంతో నీరు ప్రవాహంగా మారి అండర్ పాస్ చుట్టుపక్కల గల రోడ్లో నీరు నిలువ ఉంటుందన్నారు. నీరు కిందికి జారడంతో అండర్ పాస్ లోకి వెళ్లిన నీరు నిలువ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడేటట్లు, జారిపడి అనేక ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి కృష్ణ వాటర్ పైప్ లైన్ లీకేజ్ ని మరమ్మత్తు చేసి ప్రమాదాలకు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు, సిపిఎం పట్టణ నాయకులు చింతల శివ, ఈర్ల రాహుల్ పాల్గొన్నారు.