ఏథర్‌ ఎనర్జీ నుంచి కొత్త 450ఎస్‌

న్యూఢిల్లీ : ద్విచక్ర విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ కొత్తగా మార్కెట్లోకి 450ఎస్‌ మోడల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 450 శ్రేణీలో 450ఎక్స్‌, ప్రో వేరియంట్లను విక్రయిస్తోంది. తాజా మోడల్‌ ఏథర్‌ 450ఎస్‌ ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. ఇది గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని ఆ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌తో 115 కిలోమీటర్లకు ప్రయాణించవచ్చని పేర్కొంది. అయితే ఇది ఎప్పటి నుంచి మార్కెట్‌లో లభ్యం అయ్యేది ఆ సంస్థ ప్రకటించలేదు.