ఏథెర్‌ నుంచి కొత్త 450ఎస్‌ స్కూటర్‌

బెంగళూరు : ప్రముఖ ద్విచక్ర విద్యుత్‌ వాహనాల కంపెనీ ఏథర్‌ కొత్తగా ఏథెర్‌ 450ఎస్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. దీన్ని మూడు వేరి యంట్లలో అందుబాటులోకి తెచ్చి నట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 115 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలిపింది. 450ఎస్‌ ధరను రూ.1.29 లక్షలు గా నిర్ణయించింది. 115 కిలోమీటర్ల ప్రయాణించగల 450ఎక్స్‌ ధరను రూ.1.37 లక్షలుగా, 145 కిలోమీటర్ల రేంజ్‌ కలిగిన మరో వేరియంట్‌ ధరను రూ.1.44 లక్షలుగా ప్రకటించింది. దశలవారిగా స్కూటర్ల డెలివరీని ప్రారంభిస్తామని ఏథర్‌ ఎనర్జీ సిఇఒ తరుణ్‌ మెహతా తెలిపారు. ఓలాకు పోటీగా వీటిని ఆవిష్కరించినట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.