నవయుగ కవి చక్రవర్తి, కవికోకిల గుర్రం జాషువా

నవయుగ కవి చక్రవర్తి, కవికోకిల గుర్రం జాషువానవతెలంగాణ-ముషీరాబాద్‌
నవయుగ కవి చక్రవర్తి, కవికోకిల శ్రీ గుర్రం జాషువా అని కవి గాయకుడు మాష్టార్జీ అన్నారు. బుధవారం తెలంగాణ సాహితీ సంయుక్తంగా బాగ్‌లింగంపల్లి సుందర య్య విజ్ఞాన కేంద్రంలో కవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవి గాయకుడు మాష్టార్జీ మాట్లాడుతూ.. కులమతాలు పుట్టుకతో దళితుడైన వారు పట్టుదలతో కవిశేఖరుడై, నవయుగ కవి చక్రవర్తిగా, తన కవితాప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, విశ్వమానవుడు శ్రీ గుర్రం జాషువా అని అన్నారు. తెలుగు పండితులు మోత్కురు నరహరి మాట్లాడు తూ.. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా సమకాలీన కవిత్వ వరవడియైన భావ కవిత్వపు రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడని తెలిపారు. భవిష్యత్తు తరాలకు జాషువా సాహిత్యం చదవడం అవసరమని తెలిపారు. తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం గౌరవాధ్యక్షులు జి. రాములు మాట్లాడుతూ.. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా, అని ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయన కవిగా, వ్యక్తిగా విరాట్రూప ప్రదర్శనకు నేపథ్యాలు వెంకటిగిరి రాజావారి ఆహ్వానంపై రైలుబండిలో నెల్లూరు వెళ్తుతుంటే, తోటి ప్రయాణికుడైన మరోకవితో పరిచయమై, ఆయన కోరిక మేరకు తన స్వీయ కవితాగానం చేయగా, ముఘ్ధుడైన ఆ కవి కవిత్వం అద్భుతంగా ఉందని అంటూ, వారి కులం గురించి అడిగి తెలుసుకొని వెంటనే అక్కడనుంచి లేచివెళ్లి పోయాడట, ఆ కవి పుంగవుడు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు అయినా భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయే కవిత్వాన్ని ఆయుధంగా అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ కోశాధికారి అనంతోజు మోహన కష్ణ, తంగిరాల చక్రవర్తి,సలిమా, పిఓడబ్ల్యు ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.