కొత్త చెతక్‌ ఇవి స్కూటర్‌ ఆవిష్కరణ

కొత్త చెతక్‌ ఇవి స్కూటర్‌ ఆవిష్కరణన్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో శుక్రవారం భారత మార్కెట్లోకి కొత్త వర్షన్‌ చెతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. బ్లూ కలర్‌లో ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌తో పాటు పూర్తిగా రెట్రో డిజైన్‌తో దీన్ని ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ సింగిల్‌ చార్జింగ్‌తో 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని బజాజ్‌ ఆటో తెలిపింది. ఇంతకుముందు మార్కెట్లో ఉన్న బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ 2.88 కిలోవాట్ల బ్యాటరీ, సింగిల్‌ చార్జింగ్‌ తో 113 కిలోమీటర్ల దూరం ప్రయాణ సామర్థ్యం కలిగి ఉంది. కొత్త చేతక్‌ బజాజ్‌ ఇవి గంటకు 73 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు.