
నవతెలంగాణ – కంటేశ్వర్
ఆశా వర్కర్లకు బకాయి వేతనాలను కొత్త ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారము నిజామాబాద్ డిఎంహెచ్ఓ కి వినతి పత్రం అందజేశారు. సంక్రాంతి పండుగ ఉన్నందున ఆశా వర్కర్లకు పారితోషికాలు తక్షణమే చెల్లించాలి. గతంలో ఇచ్చినట్లు ప్రతి నెల 2వ తేదీన పారితోషికాలు చెల్లించాలని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లకు డిసెంబర్ నెల పారితోషికాలు నేటికీ ప్రభుత్వం చెల్లించలేదు. ప్రజలందరూ నిర్వహించుకునే సంక్రాంతి పెద్ద పండుగ దగ్గరలో ఉంది. ఈ సందర్భంలో డిసెంబర్ నెల పారితోషికాలు నేటికీ రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు ప్రతి నెల 2వ తేదీన పారితోషికాలు చెల్లించింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారితోషికాలు చాలా అలస్యంగా చెల్లిస్తున్నారు. రెండో తేదీన వేయాల్సిన పారితోషికాలు నెల చివర్లో వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నెల కూడా దాటిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఆశా వర్కర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల మొదటి వారంలో చెల్లించాల్సిన పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పాల, బిల్లు డ్వాక్రా గ్రూపు డబ్బులు, నిత్యవసరాల సర్కుల కోసం ఆశా వర్కర్లు అవసరాలరరీత్య అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పండుగల సందర్భంగా అయితే అప్పు చేసి మరి పండుగలు జరుపుకునే పరిస్థితికి ఏర్పడింది. కావున పై అంశాలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా కోశాధికారి రేణుక, జిల్లా నాయకురాలు రాధా తదితరులు పాల్గొన్నారు.