స్కోడా నుంచి సరికొత్త కుషాక్‌, స్లావియా

న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ స్కోడా ఆటో ఇండియా సరికొత్తగా కుషాక్‌, స్లావియా వేరియంట్లను విడుదల చేసినట్లు ప్రకటించింది. భద్రతలో 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన నూతన వేరియంట్‌లు 1.0 టిఎస్‌ఐ పెట్రోల్‌ వర్షన్‌, 1.5 టిఎస్‌ఐ పెట్రోల్‌ వర్షన్లలో లభ్యమవుతుందని ఆ సంస్థ తెలిపింది. కుషాక్‌ లీటర్‌కు 19.76 కిలోమీటర్లు, స్లావియా 20.32 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయని తెలిపింది. వీటి ప్రారంభ ధరను రూ.10.69 లక్షలుగా నిర్ణయించింది.