కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

నవతెలంగాణ కమ్మర్ పల్లి
కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఆకుల బాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా జోగ గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా చిలివేరి  పవన్ కుమార్, కోశాధికారిగా సురంగి చంద్రశేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బాలకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలో బ్యాడ్మింటన్ క్రీడ అభివృద్ధికి, అసోసియేషన్ ఆధ్వర్యంలో యువతలోని క్రీడ నైపుణ్యాలు వెలికి  తీసేందుకు అసోసియేషన్ సభ్యుల సహకారంతో తన వంతుగా కృషి చేస్తానన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను తోటి సభ్యులు అభినందించారు.