నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి: అంతిరెడ్డి రాజారెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ లైబ్రరీ యందు నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తో కలిసి ఆదివారం సందర్శించారు. లైబ్రరీలో నెలకొన్న సమస్యల గురించి పాఠకులను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం దృష్ట్యా చల్లని మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. లైబ్రరీలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే టాయిలెట్స్ ను నిర్మిస్తామని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆయన పరిశీలించి త్వరగా భవనాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నిర్లక్ష్యంగా సర్వీస్ లైన్ వైర్ ఉండడంతో ఆయన ఆగడం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఆయన సంప్రదించగా లైన్మెన్ గ్రంధాలయానికి విచ్చేయగా ఆయనతో మాట్లాడి సర్వీస్ లైన్ వైర్ ను సరిచేయాలని సూచించారు. భవనం పూర్తికాగానే డిజిటల్ లైబ్రరీ ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాఠకులతో ఈ విషయంపై చర్చించారు. లైబ్రరీ సేవలను పాఠకులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీయన్ వరలక్ష్మి , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.