– బీజేపీ ఇంచార్జి రవి కుమార్
నవతెలంగాణ -పెద్దవూర
సోషల్ మీడియా లోపార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని నేను బీజేపీ లోనే కొనసాగుతున్నానని నాగార్జున సాగర్ బీజేపీ ఇంచార్జి పానుగోతు రవికుమార్ తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దని అన్నారు. పార్టీ నమ్ముకుని పని చేస్తున్నాను నేను నమ్ముకున్న పార్టీని విడిచి వేరే పార్టీలో వెళ్లాల్సిన ఆలోచన అవసరం నాకు లేదని తెలిపారు. గత ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గిరిజన బిడ్డకు గుర్తించి జనరల్ స్థానంలో టికెట్ కేటాయించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆ సంతోషం రెట్టింపు చేసుకొని అదే పార్టీ లో కొనసాగుతా కానీ ఒకరు ఇచ్చే ప్యాకేజీలకు ఎవరో వచ్చి మభ్య పెడితే పార్టీ మారే సవాల్ లేదని గిరిజన నాయకుడిగా నాగార్జున సాగర్ లో కొనసాగుతా అని అన్నారు.