మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ సాంస్కృతి సంప్రదాయాలకు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి అన్నారు. పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ లో వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం విద్యార్థినీ విద్యార్థులచే ప్రార్థన కార్యక్రమం ముగిసిన వెంటనే రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కమిషనర్ బట్ట తిరుపతి బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంస్కృతి, క్రమశిక్షణకు సాంప్రదాయాలకు, మారుపేరు సరస్వతీ శిశుమందిర్ అని విద్యార్థులు కష్టపడి సమయపాలన పాటించి ఉన్నత విద్యాభ్యాసం పొందేలా భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉండేలా ఎల్లప్పుడూ కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం కమిషనర్ బట్టు తిరుపతిని పాఠశాల యాజమాన్యం పక్షాన ఘనంగా శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు,.గోపు వెంకటేష్ ప్రబంధకారి కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, పాఠశాల కోశాధికారి నీలి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొండబత్తిని అమర్ నాథ్, ప్రబంధ కారిణి రమ్య, సమితి సభ్యులు, పాఠశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.