మర్డర్ కేసును చేదించిన నిజామాబాద్ పోలీసులు

నవతెలంగాణ కంటేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో  నిజామాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి మర్డర్ కేసును ఛేదించారు. వివరాల్లోకి వెళితే వినాయక నగర్ లో బుధవారం రోజున మురళి హోటల్ ముందు జరిగినటువంటి మర్డర్ కేసులో  నిందితుడు సాయి కుమార్ ను  నమ్మకమైన సమాచారం  మేరకు అమ్మ వెంచర్  దగ్గర ఒక డైరీ ఫార్మ్ వద్ద  పట్టుకొని విచారించగా  నేరము ఒప్పుకున్నాడు. ఆరోజు రాత్రి వంశీ వినాయక లిక్కర్ మార్ట్ యందు మద్యం సేవిస్తూ ఉండగా నిందితుడు మూత్రవిసర్జనకు వెళ్ళగా మృతుడు ఆనంద్ బిహరి పాండే వెనకాల నుంచి నెట్టివేగా నిందితుడు సాయికుమార్  కింద పడిపోయినాడు.  ఆ విధంగా ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ తర్వాత మద్యం సేవించిన తర్వాత మద్యం షాపు నుంచి బయటికి వచ్చి తిరిగి అదే విషయంలో  గొడవ పడగా నిందితుడు మృతుడిని గొంతు పట్టి  వెనుకకు నెట్టి వేయగా  మృతుడు వెలికిల  పడి తలకు వెనుక భాగంలో తీవ్ర గాయమైనది.  పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకొని  ముఖము మీద ఎత్తివేయగా తీవ్ర గాయం తో రక్తస్రావం జరిగి  ఆనంద్ బిహారీ పాండే అక్కడికక్కడే చనిపోయారు.  ఇట్టి కేసును చేదించడంలో 4వ పట్టణ ఎస్ హెచ్ ఓ పాండేరావు,  ఏ ఎస్ ఐ సాయిలు,  సిబ్బంది మనోజ్, అనిల్, బాలాజీ, భూరాజ్, సంగేస్, నారాయణ, రవి రమేష్ ,రాకేష్ లు మంచి ప్రతిభ కనబరిచారు.