నవీన శ్రామికుడు

కె .శాంతారావు 9959745723 సొంత నేలను
ముద్దాడటం
ఎవరికైనా
అన్నం ముద్ద
తినడం వంటిదే

గాలిలో దీపంలా
గాజులో శాంతిక్షణాలు

జన్మభూమికి జనవాహిని
తరంగాల్లా తరలి రావడం
మన కాలపు గొప్ప దశ్యం

కోవిడ్‌లో చూశాం
మరల ఇప్పుడు..

పొట్ట చేతపట్టుకుని
ప్రవాసాలకు పోవడం ..
ప్రాణాలు గుప్పెట పట్టుకుని
సొంతగూటికి రావడం..

అదెంత జీవన సత్వమో
ఇదంత మౌలిక సత్యం
ఆ ఆకలికి
ఈ భయానికి
వారథి కడుతున్నాడు
నవీన శ్రామికుడి

ఆంక్షలు పెట్టేవాడు
కరుడుకట్టిన కారోరేటే
గోతికాడ నక్కలే
యుద్ధ ఊళలు విప్పిస్తుంటాయి
ఇక వెతుకులాట దేనికి ?

ఎటునుంచి ఏదైనా
మానవాళి జీవనయానం
అనంతం, అసిధారావ్రతం అజరామరం.
కె .శాంతారావు
9959745723