
– సమాజ సేవలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు..
– గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులను కాలరాశారు..
– ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ ..
– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నవతెలంగాణ-మునుగోడు : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉపాధ్యాయులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య ను అందించి పాఠశాలలో ఉన్న 200 మంది విద్యార్థుల సంఖ్యను 400 కు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు . బుధవారం మండలంలోని కొంపెల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా నిర్మించిన మూడు అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్ గోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు . అనంతరం మండలంలోని ఊకొండి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు , 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ పాఠశాలకు వచ్చి చూస్తే తరగతి గదులు కూలే స్థితిలో ఉన్న ఈ పాఠశాలను రెండు కోట్ల రూపాయల వ్యయంతో అన్ని వసతులతో కూడిన పాఠశాలను నిర్మించాలనే ఆలోచన వచ్చింది కానీ ప్రభుత్వ అనుమతులు రావని స్థానికులు చెప్పడంతో 30 లక్షల ను తమ తల్లి ఫౌండేషన్ ద్వారా అందించామని తెలిపారు .పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యత మీది అని అన్నారు.ఈ పాఠశాలలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ విడుదలవారీగా పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కు ప్రాధాన్యత ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులను కాలరాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు నియంత పరిపాలన పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం పేదల ప్రభుత్వం వచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. పార్టీ వాళ్లకు అయితేనే సంక్షేమ పథకాలు ఇస్తాం ఆ పార్టీ వాళ్లకైతే సంక్షేమ పథకాలు ఇవ్వం అనే విధానానికి స్వస్తి పలకాలి అని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం అని తెలిపారు. ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ఎవరు అడ్డుకోవద్దు ఆటంకం కలిగించవద్దు ఈ విధానం అలవాటు చేసుకోవాలి అని ప్రజా ప్రతినిధులకు అధికారులకు సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని పీహెచ్సీ సెంటర్ ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం హాస్పిటల్ లోని పరిసరమును అంతా కలియతిరిగి సిబ్బంది పనితీరు, ఆసుపత్రి లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ , మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్,
సర్పంచులు జాల వెంకటేశ్వర్లు, తాటికొండ సంతోష సైదులు , నడింపల్లి యాదగిరి , జక్కల శ్రీను యాదవ్ , పగిళ్ల బిక్షమయ్య , కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేదిరే మెగా రెడ్డి , విజయేందర్ రెడ్డి , బొజ్జ శ్రీను , కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి , మాజీ సర్పంచులు , మాజీ ఎంపిటిసిలు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.