– స్టార్టప్‌ల సంఖ్య 10రెట్లు పెంచాలి : కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే ఆరేండ్లల్లో యునికార్న్‌ల సంఖ్య పదివేలకు పెరగాలని, స్టార్టప్‌ల సంఖ్యను పది రోట్లు పెంచాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్ అన్నారు. శనివారం రాత్రి మాదాపూర్‌లోని హౌటల్ వెస్టిన్‌లో జీటో ఇంక్యుబేషన్‌లో ఇన్నోవేషన్ ఫౌండేషన్(జేఐఐఎఫ్) ఆరో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు, పెట్టుబడిదారుల సమ్మేళనంలో మాట్లాడారు. 2030 నాటికి 5 ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
జలరంగంలో పుష్కలంగా అవకాశాలు :జీటో ఇన్వెస్టర్స్ కాన్‌క్లేవ్‌లో కేంద్ర మంత్రి జలశక్తి
జలశక్తి రంగంలో స్టార్టప్‌లు అన్వేషించగల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. తాగునీటి నాణ్యతను పరీక్షించడానికి భారతదేశంలో 2వేల ఎన్‌ఏబీఎల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నీటి రంగంలో 240 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మాదాపూర్‌లోని టీి-హబ్‌లో జీటో ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (జేఐఐఎఫ్) రెండు రోజుల పెట్టుబడిదారుల సమ్మేళనం, వ్యవస్థాపకుల దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జనాదరణ పొందినట్లుగా కాకుండా, దేశీయ, పారిశ్రామిక రంగాల కంటే వ్యవసాయ రంగం భారతదేశంలో ఎక్కువ నీటిని వినియోగిస్తుందన్నారు.
వచ్చే ఆరేండ్లల్లో యునికార్న్‌ల సంఖ్య పదివేలకు పెరగాలి
2:18 am