బోధన్ జిల్లా ఆస్పత్రిలో కార్మికుల సంఖ్యను పెంచాలి..

– ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆస్పత్రి ముందు ధర్నా , 

– ఆస్పత్రి సూపరిండెంట్ కు వినత
నవతెలంగాణ – బోధన్
బోధన్ జిల్లా ఆస్పత్రి ప్రధాన గేటు ముందు సోమవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సూపరిండెంట్ శివకుమార్ కు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వై. ఓమయ్య మాట్లాడుతూ.. బోధన్ జిల్లా ఆస్పత్రికి ప్రస్తుతమున్న బోధన్ పరిసర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా అవుట్ పేషన్స్ ఓపి, ఇన్ పేషెంట్, ఐపి కొరకు పెద్ద మొత్తంలో పేషెంట్లు పెరుగుతున్నందున బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని 250 పడకలకు పెంచాల్సిన అవసరం ఉన్నదని, దీంతోపాటు ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా ఆస్పత్రిలో కార్మిక సంఖ్యను పెంచాలని, కార్మికులకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న వేతనం వెంటనే ఇవ్వాలని, 2023 మే 1న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులందరికీ నెలకు రూపాయలు వెయ్యి పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శంకర్, సాయిలు, నాగమణి, నయీమ్, తదితరులు పాల్గొన్నారు.