నవతెలంగాణ-నూతనకల్
ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివద్ధే ప్రభుత్వధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని తాళ్ళ సింగారంలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డైనింగ్‌హాల్, తరగతి గదులను ప్రారంభించారు.అనంతరం బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పన్నాల సైదిరెడ్డి సుమారు 250 మంది విద్యార్థులకు రూ.1.5 లక్షల వ్యయంతో విద్యార్థులకు అందించే స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక సంక్షేమ పథకాలు అయిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, గహలక్ష్మి ,మన ఊరు -మనబడి ఆసరా పింఛన్లతో పాటు అనేక అభివద్ధి కార్యక్రమాలను అమలు చేసిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి భేటీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు అంతకుముందు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మెన్ సురేందర్‌నాయక్,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చూడి లింగారెడ్డి,ఎంపీటీసీలు పన్నాల రమా మల్లారెడ్డి,తండు రేణుక, ఎంపీడీఓ ఇందిర, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంఈఓ రాములునాయక్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మున్న మల్లయ్య,ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్ బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పన్నాల సైదిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు తాడూరి సైదులు, పరమేష్,బద్దం వెంకట్‌రెడ్డి, చౌగాని లింగయ్య పాల్గొన్నారు.