నవతెలంగాణ -ఆలేరు రూరల్
సీఎం కేసీఆర్ రైతుల అభివద్ధే లక్ష్యంగా పెట్టుకొని రైతుల రైతుబంధు ,రైతు బీమా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే ఉందని బీఆర్‌ఎస్ యువజన మండల నాయకులు సొంటెం ప్రవీణ్ అన్నారు. గురువారం మండలంలోని కొలనుపాక గ్రామంలో జైన్ మందిర్ ఆవరణంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రైతులకోసం ప్రాజెక్టులు నిర్మించి సాగునీరందిస్తున్నారన్నారు. రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచాడన్నారు.ఈ కార్యక్రమంలో నరేష్ ,కరుణాకర్, సుమన్, ఉపేందర్ ,బాలు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.