– కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కాసం రంజిత్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
మహబూబాద్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబండ జాతుల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి నా లక్ష్యమని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు కాసం రంజిత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మహబూబాద్ నియోజకవర్గాన్ని బంగారు నియోజకవర్గంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య నాయక్ అని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపకు చేరే విధంగా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని ప్రజల క్షేమం కోసం నిరంతర కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న వ్యక్తి అని తెలిపాడు. మండలంలోని ఉమ్మడి గ్రామపంచాయతీలో ఉన్న గతంలో నారాయణపురం భూ సమస్యలు నేటికీ పరిష్కారం గాక ప్రజల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే చూసి వారి ప్రాణం తల్లడించి వెంటనే ప్రభుత్వానికి నివేదికను అదించి ఆలేరు నారాయణపురం భూ సమస్యల పరిష్కారానికి వెంటనే సంబంధిత మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేశారని అన్నారు. గత పాలకుల వారిని పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించడం ద్వారానే వారి ఇబ్బందులు పడ్డారని అన్నారు వారికి ఇప్పటినుండి ఏ ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.