రాజ్యాంగ రూపకర్తలు ఆశయాలు దిశగా గ్రామ స్వరాజ్యం నిర్మాణం లో భాగంగా మౌళిక సదుపాయాల కల్పన కు నడుం బిగించాను అని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మంగళవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో రూ.1 కోటీ 54 లక్షల 90 వేల నిధులతో నిర్మించనున్న పలు అంతర్గత రహదారులు, మురికి నీటి కాలువలు, పశువులు షెడ్ లకు ఆయన శంకుస్థాపన చేసారు. అనంతరం స్థానిక తన క్యాంప్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించి రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజక వర్గం వ్యాప్తంగా నేటి వరకు రూ.48 కోట్ల 41 లక్షల 71 వేల 8 వందల 72 లు నిధులు మంజూరు చేయించాను అని ప్రకటించారు.ఇందులో పంచాయితీలు రాజ్ విభాగంలో రూ.37 కోట్ల 32 లక్షల 78 వేలు,మహాత్మా గాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ విభాగంలో రూ.11 కోట్ల 08 లక్షల 93 వేల 8 వందల 72 లు గా వివరించారు.ఈ నిధులతో మౌళిక సదుపాయాలు,వ్యవసాయ అనుబంధ రంగాలకు,ప్రజా రవాణా కు,అంగన్వాడీ భవనాలు అభివృద్ది చేస్తామని తెలిపారు.హలో శుభోదయం,మీ ఊరిలో మీ ఎమ్మెల్యే,లబ్ధిదారుల వద్దకే సంక్షేమ పధకాలు అనే కార్యక్రమాల్లో నేను స్వయంగా గుర్తించిన సమస్యలనే నేడు ప్రజాపాలన విజయోత్సవాలు లో పనులు జాతర ప్రారంభించాను అని హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ,తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్, పంచాయితీ రాజ్ డీఈఈ పి.శ్రీధర్, ఏఈఈ అక్షిత, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఈజీఎస్ ఏపీవో రామచంద్రరావు, కార్యదర్శి కోటమర్తి శ్రీరామమూర్తి, పశుసంవర్ధక శాఖ ఏడీఏ కే.ప్రదీప్ కుమార్, కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు, జూపల్లి రమేష్, సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, మిండా హరిక్రిష్ణ లు పాల్గొన్నారు.