సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
నవ తెలంగాణ – బోనకల్
బిజెపిని ఓడించడమే వామపక్షాల లక్ష్యమని ఇందుకు అవసరమైన అన్ని లౌకిక శక్తులతో కలిసి పని చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు. మండల పరిధిలోని రావినూతల గ్రామంలో బోనకల్ జోన్ సమావేశం తెల్లాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతతత్వాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తుందని, ఈ ఈ ప్రయత్నాలను వామపక్షాలు దీటుగా ఎదుర్కొంటాయి అన్నారు. బిజెపి పరిపాలనలో పేద ప్రజలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు హక్కులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పెట్టుబడిదారులు, కార్పోరేట్ సంస్థలు తమ సంపదను పెంచుకుంటున్నాయన్నారు. పెట్టుబడిదారులకు రుణాలు మాఫీ చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. పెట్టుబడిదారులు ప్రభుత్వం అయినా బిజెపిని ఓడించకపోతే భారతదేశాన్ని సర్వనాశనం చేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే పరిష్కార మార్గమని ఆయన స్పష్టం చేశారు. సిపిఎం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలోనే పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలో సిపిఎం విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకు సిపిఎం శ్రేణులు కార్యకర్తలు విజయం కోసం సైనికుల్లా పని చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరావు మాట్లాడుతూ మతోన్మాద బిజెపిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలంటే వామపక్షాలు ఇతర పక్షాలు ఏకం కావాలని అందుకు ఇప్పటినుండే ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు జోన్ కన్వీనర్ గుగులోతు పంతు, శాఖ కార్యదర్శులు మంద వీరభద్రం, కొంగర గోపి, జోనిబోయిన గురవయ్య, ఎర్రగాని నాగరాజు, గుగులోతు నరేష్, నాయకులు షేక్ నాగుల మీరా, లావూరి వెంకటేశ్వర్లు, మరీదు నారాయణ, దొండపాటి సత్యనారాయణ, గద్దె రామారావు, బానోతు నాగేశ్వరరావు, గండు సైదులు, బట్ట నాగేశ్వరరావు, కొమ్మినేని జగన్నాథం, బిల్లా విశ్వనాథం, ఉప్పర శ్రీను, బొబ్బిళ్ళపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.