
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పిస్తున్నారు. అందులో భాగంగా పెద్ద కొత్తపల్లి మండలంలోని కొత్త యాపట్ల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి అనే బాలుడు స్థానికంగా గొర్ల కాపరిగా పనిచేస్తున్నాడు. మంగళవారం బాల కార్మికుని అచ్చంపేట పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చెంచు పెంటలలో ఏజెన్సీ గ్రామాలలో బాల కార్మికుల గుర్తించి ఆశ్రమ పాఠశాలలో చేర్పించాలని సిబ్బందికి సూచించారు. బాలునికి రెండు జతల బట్టలు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, ఇచ్చారు. శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. ఏ టి డి ఓ యాదమ్మ,, పాఠశాల హెడ్మాస్టర్ మల్లేష్ ఉన్నారు.