నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని బాల్ నగర్ గ్రామానికి చెందిన గుంజే చిన్నక్క W/o గుంజె నడ్పి గంగారాం, వ., 63 సం.,లు కనిపించడం లేదని కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు. శుక్రవారం కొడుకుతో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళి పోయింది. తిరిగి రాలేదు. కొడుకు వెంకటి ధరకాస్తు పై కేసు నమోదు చేసినాము. ఆచూకీ తెలిసిన వారు జక్రాన్ పల్లీ ఎస్ఐ గారికి 8712659853 కి తెలియజేయగలరు.