– స్పందించని పక్షంలో నిరాహార దీక్షకు సైతం సిద్ధం
– ప్రధానోపాధ్యాయులు షేక్ మహమూద్ పాషా
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం విదితమే. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు పోస్టల్, టెలికం, ఇన్కమాక్స్, డిఫెన్స్, డీఆర్డీవో లాంటి కీలకమైక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యో
గులందరూ పాత పెన్షన్ విధానం కోరుతూ జాతీయ స్థాయిలో సమ్మెకు దిగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆళ్ళపల్లి మండల పరిధిలోని జాకారం గ్రామం ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రకృతి ప్రేమికులు, ఫ్రూటేరియన్ షేక్ మహమూద్ పాషా గత ఫిబ్రవరి 13వ తేదీన నుంచి మార్చి 4వ తేదీ వరకు ఒకపూట భోజనం చేస్తు ప్రభుత్వ మొండి వైఖరిపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గురువారంతో ఒంటిపూట భోజనంతో నిరసన కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఆయన నవతెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు న్యాయమైన పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రానున్న కాలంలో నిరాహార దీక్షకు సైతం వెనుకాడని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానం వల్ల నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. మే నెల 1న కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో దాదాపు 24 లక్షల మంది పాల్గొననున్నారని, మండలంలోని ఉపాధ్యాయులు సైతం పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కార్యాచరణ రూపొందించడం జరిగిందని చెప్పారు. కాగా, ప్రస్తుతం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలలో దాదాపు 34 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వారిలో దాదాపు 70 శాతం మంది నూతన పెన్షన్ విధానం పరిధిలోకి వచ్చిన వారే ఉన్నారని, వారి గోడును సైతం వివరించారు. దాంతో ఆ వర్గం మొత్తం సమ్మె బాట పట్టబోతున్నారని తెలిపారు. ముఖ్యంగా రైల్వే, పోస్టల్, టెలికం, ఐటీ, డిఫెన్స్ వంటి ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులంతా సమ్మెకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఎస్సీ ఆర్ మద్దూర్ యూనియన్ తో పాటు ఎస్సీ
ఆర్ ఎంప్లాయిస్ సంఘ్, వాటికి అనుబంధంగా ఉన్న పలు సంఘాల సభ్యులు కూడా పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటూ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు మాట్లాడారు.