వెనుకట కాలంలో పనీపాట లేని విశ్రాంత వర్గాలు శ్రమజీవులతో అన్ని పనులు వెట్టిచాకిరి చేయించుకొనేవారు. వాళ్ల ఇండ్లలో అందరికీ అన్ని పనులు ఊరి మనుషులు ఉచితంగా చేసేవారు. కుర్చీలో కూర్చొని చుట్ట తాగుతున్నప్పుడు అందులో నిప్పు ఆ దొరవారి తొడ మీద పడ్డది. ఆయన గారు తన పని చేసుకోరు కదా! అప్పుడు ‘తొడ మీద అగ్గి పడ్డది, జర తీయ్యర ఎంకా!’ అని సేవకుని పురమాయించిన సంఘటన అది. ఇప్పటికీ ఆ వర్గాల వారు వాళ్ల సొంత పనులను కూడా ఇతరులుతో పనిచేయుచుకుంటారు. తొడ మీద నిప్పు రాలి తొడ కాలిపోతుంటే కూడా తను తీసుకోడు అది కత. ఇదే అగ్గి మీద మరో సామెత ‘ఓపిక లేనమ్మ ఒడిల అగ్గేసుకుంటే, ఒడి కాలిందట దడి కాలిందట’. దేనికైనా ఓపిక ఉండాలి. ఇలా ఓపిక లేని వాళ్ళని చూసి ‘ఓపిక లేని అత్తకు వంగలేని కోడలట’ అనే సామెత పుట్టింది. అత్తను చూసి కోడలు అలవాట్లు అట్లా మారిపోయాయి. ‘తల్లికి బొల్లి ఉంటే సుక్క ఉన్నదట’ అట్లనే అత్త తీరు కోడలు తకురారు.
‘ఓపని వానికి కోరికలు ఎక్కువ, వల్లని వానికి ఆటలు ఎక్కువ’ అంటారు. ఓపని అంటే ఓపిక, వల్లని అంటే వద్దు అన్నట్లు. అసలే పనిచేసే ఓపిక లేదు… కోరికలు ఎక్కువైతే మరి ఎట్లుంటది. అట్లాగే వద్దన్నవానికి ఆట ఎక్కువ. మనుషుల తత్వాన్ని బట్టి సామెతలు మనుషులే సష్టించుకున్నారు.
– అన్నవరం దేవేందర్, 9440763479