
జన్నారం మండలం పలు గ్రామాల శివారులలో క్రాప్ డిజిటల్ సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జన్నారం మండలంలోని రాంపూర్ తిమ్మాపూర్ సింగరాయపేట తపాలాపూర్ గ్రామ శివారులో రైతుల పొలాల్లో వేసిన పంటలను గుర్తింపునకు సింగరాయపేట క్లస్టర్ ఏఈఓ సాయి శుక్రవారం డిజిటల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రైతుల పొలాలకు వెళ్లి అక్కడ వేసిన పంటలను ఫోటో తీసి ఆన్లైన్లో నమోదు చేశారు. పంటల నమోదు ప్రక్రియ డిజిటల్ సర్వే రూపంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.