యూనివర్సిటీలో కొనసాగుతున్న ఖేల్ ఉత్సవ్ క్రీడా పోటీలు…

నవతెలంగాణ – డిచ్ పల్లి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేల్ ఉత్సవ్ క్రీడా పోటీలలో భాగంగా రెండవ రోజు వాలీబాల్ క్రీడను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి రావు ముఖ్య అతిథిగా పాల్గొని వాలీబాల్ క్రీడలు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులంతా చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలన్నారు. విద్యార్థులంతా వివేకా నందుడు చుపిన మార్గంలో నడిచి క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్,జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివ,రాష్ట్ర కార్యసమితి సభ్యులు అమృతాచారి యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్,నాయకులు నాగరాజు సమీర్, అక్షయ్, లెనిన్, అజయ్, సతీష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.