కొనసాగుతున్న వీఓఏల సమ్మె

నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
డిమాండ్ల సాధన కోసం ఐకేపీ వీఓఏలు చేపపడుతున్న సమ్మె బుధవారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. స్థానిక ఐకేపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం టెంట్‌ మంగళవారం కురిసిన భారీ గాలి వానకు కొట్టుకుపోయింది. అయినా పట్టు వీడని వీఓఏలు బుధవారం మండుటెండలో సైతం సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ముంజం ఆనంద్‌కుమార్‌తో పాటు వీఓఏలు పాల్గొన్నారు.