సాగునీరు సాధించడమే ఏకైక లక్ష్యం…

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: సాగునీరు సాధించడమే ఏకైక లక్ష్యంగా ఆందోల్ మైసమ్మ జలసాధన సమితి పనిచేస్తుందని వరకంతం పెంటా రెడ్డి అన్నారు.శుక్రవారం పీపల్ పహాడ్ గ్రామంలో ఆందోల్ మైసమ్మ జలసాధన సమితి కరపత్రాలను మాజీ ఎంపిటిసి వరకంతం పెంటారెడ్డి అధ్యక్షతన ఆవిష్కరించారు. గ్రామంలో సాగినీరు సాధించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని ముక్తకంఠంతో రైతులు ప్రతిజ్ఞ చేశారు.చౌటుప్పల్ ఎగువ బాగాన అనేక గ్రామాలకు సాగునీరు లేక ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని పీపల్ పహాడ్ మాజీ ఎంపీటీసీ పెంటా రెడ్డి అన్నారు.గీత కార్మికులకు వర్షాలు లేక కళ్ళు కూడా దిగే పరిస్థితి లేదని గీత కార్మికులు వాపోయారు. గ్రామ ప్రజలు పార్టీలకు అధికంగా ఏకతాటిపైకి వచ్చి సాగునీరు సాధించడమే కర్తవ్యం పనిచేస్తామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సాగునీరు సాధించడమే లక్ష్యంగా ఒప్పించి తీరుతామని జలసాధన సమితి నాయకులు మెట్టు సుదర్శన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో పీపల్ పహాడ్ మాజీ సర్పంచ్ రాణిరంగారెడ్డి జలసాధన సమితి సభ్యులు బద్దం అంజిరెడ్డి బొమ్మిడి నర్సిరెడ్డి మునుకుంట్ల వెంకటేష్ గౌడ్ ఎర్ర గాలయ్య నూనె సహదేవ్ రోషణగారి మల్లేశం ఎర్ర బుచ్చయ్య తోటకూర మల్లేశం కంచరకుంట్ల వెంకటరెడ్డి బూడిద జగన్మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ గోపి సుధాకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు