
– అర్బన్, రూరల్ మరో మూడు మండలాలకు అదనపు బాధ్యతలు..
– వేధిస్తున్న సిబ్బంది కొరత, ఆరు గురు సిబ్బందికి ఒకే ఒక్కడు..
నవతెలంగాణ – వేములవాడ
మండల విద్యాధికారి కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది.. సిబ్బంది లేరు పనిచేసేది ఎవరు..?2024-25 విద్యా సంవత్సరం జూన్ 12 తో విద్యా సంవత్సరం మొదలై నాలుగు రోజులు గడుస్తుంది.. నేటి వరకు వేములవాడ మండల విద్యాధికారి ఎవరు అనేది పట్టణ ప్రజలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థి సంఘాల నాయకులకు తెలియని పరిస్థితి.. డీఈవో రమేష్ కుమార్ ను సంప్రదించగా వేములవాడ ఎంఈఓ బన్నాజీ అని తెలిపారు. పాఠశాలలు మొదలై నాలుగు రోజులు గడుస్తున్న విద్యాధికారి కార్యాలయం గది తెరుచుకుని లేదు. వేములవాడ అర్బన్, రూరల్ మండల విద్యాధికారి కార్యాలయం ఇద్దరు కోఆర్డినేటర్లు ( విద్యాధికారి సహాయకులు) ఇద్దరు కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు అటెండర్లు విధులు నిర్వహించాల్సింది ఉండగా సిబ్బంది కొరతతో , అర్బన్, రూరల్ కలిపి ఒకే ఒక్కడు డేటాఎంట్రీ ఆపరేటర్ ఒక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. అర్బన్, రూరల్ ఎంఈఓ కార్యాలయంలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని విద్యార్థి సంఘాల నాయకులు పట్టణ ప్రజలు కోరుతున్నారు. గతంలో వేములవాడ అర్బన్, రూరల్, ముస్తాబాద్, ఇల్లంతకుంట, గంభీరావుపేట్ మండలాల విద్యాధికారిగా పని చేసిన బన్నాజీ ఈ మధ్యన జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇల్లంతకుంట లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు భూక్య బన్నాజీ ఎంఈఓ గా సస్పెండ్ చేశారు.బన్నాజీ సస్పెండ్ చేయడంతో సిరిసిల్ల ఎంఈఓ దూస రఘుపతికి వేములవాడ అర్బన్, రూరల్ తోపాటు ముస్తాబాద్, ఇల్లంతకుంట, గంభీరావుపేట్ ఎంఈఓ గా అదనపు బాధ్యతలు డీఈవో నియమించారు. కానీ రఘుపతి బాధ్యతలు చేపట్టకపోవడంతో, తిరిగి ఈనెల 7న వేములవాడ జడ్పీహెచ్ఎస్ బాలికల ప్రధానోపాధ్యాయులుగా వరంగల్ స్కూల్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.బన్నాజీ ఎంఈఓ గా బాధ్యతలు ఇచ్చినట్లు డీఈవో చెప్పుతున్నారు.. కానీ ఎంఈఓబన్నాజీ మాత్రం కార్యాలయానికి రావడం లేదు.. ఆయన గది తెరుచుకోవడం లేదు..ఎంఈఓ ను కలవాలంటే వేములవాడ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలకు వెళ్లి కలవాల్సిందే, ఫోన్ చేస్తే స్పందించారు. కార్యాలయంలో ఉండాల్సిన అధికారి కార్యాలయానికి రావడం లేదని విద్యార్థి సంఘాలు ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.