నవతెలంగాణ – కోహెడ
కోహెడ మండలానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పది నెలల కాలంలో రూ.50 కోట్ల నిధులను మంజూరు చేశారని, అలాంటి మంత్రి పొన్నంను విమర్శించే అర్హత ప్రతిపక్షాలకు లేదని పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ లో మండల నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాలకు రోడ్లు, విద్య, వైద్యం కోసం కృషి చేస్తున్న మంత్రిని విమర్శించడం సరైన చెర్య కాదన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గత 10 సంవత్స రాలు పదవిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు చేసిన అభివృద్ధి ఏదో చూపించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యయని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను చివరి దశలో ఇవ్వకపోగా వాటిని మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్దిదారులకు అందజేశరన్నారు. నియోజకవర్గ స్థాయి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తంగళ్ళపల్లి గ్రామంలో రూ.180 కోట్ల రూపాయలతో 25 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయుటకు భూమి పూజ చేశారన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి నిధులు మంజూరు చేసి, మహిళల తో ప్రతి పాఠశాలలో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.