
– మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే శంకుస్థాపన
– కాంగ్రెస్ హయాంలో విద్యుత్,నీళ్లులేకా రైతుల ఆత్మహత్యలు
నవతెలంగాణ-బెజ్జంకి
కాంగ్రెస్ పరిపాలన హయాంలో సరైన విద్యుత్,నీళ్లులేకా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని..రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్లతో ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అవేదన వ్యక్తం చేశారు.శనివారం మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ కార్యలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనతో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోందని ఎమ్మెల్యే రసమయి అన్నారు.అనంతరం మిని స్టేడియం నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి కేజీవీబీ విద్యాలయంలో విద్యార్థులతో కలసి మొక్కలను నాటారు.ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కవిత,సర్పంచ్ మంజుల,ఎఎంసీ చైర్మన్ కచ్చు చంద్రకళ,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.