బునాదిగాని కాలువను వెడల్పు చేసి దర్మారం వరకు నీళ్ళు అందించాలి….

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి. జహ‌ంగీర్ …
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
      బునాదిగాని కాలువను వెడల్పు చేసి ధర్మారం వరకు సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుదవారం భువనగిరి మండల పరిధిలోని యర్రంబెల్లి, నమాత్ పల్లి, నందనం, అనాజిపురం గ్రామాలలో బునాదిగాని కాలువ పూర్తి చేయాలని, మోసినీళ్లకు బదులుగా ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు అందించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోటార్ సైకిల్  ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు గడిచిన నేటికీ బునాదిగాని కాలువను పూర్తి చేయక పోవడం పాలకుల నిర్లక్ష్యం అనే విమర్శించారు. ఇప్పటికైనా నిధులు కేటాయించి వెంటనే కాలువను పూర్తి చేసి సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ మూసీ జల కాలుష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉన్నదని మూసీ జలాలతో పండిన పంటలు, కూరగాయలు, పాలు, చేపలు, కళ్ళు విషముగా మారుతున్న పరిస్థితి ఉన్నదని ఆవేదన వెలిబుచ్చారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నీళ్లకు బదులుగా గోదావరి నది జలాలు బసవపురం రిజర్వాయర్ నుండి వడపర్తి కత్వ నింపి వాటి ద్వారా అన్ని గ్రామాలకు గోదావరి జిల్లాలు అందించడంతో ప్రజల బతుకులు మార్పులు వస్తాయని, ఆరోగ్యంగా జీవిస్తారని దీని కోసం ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొమటిరెడ్డి చంద్రారెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మూసీ ప్రక్షాళన – గోదావరి కృష్ణ జలాల సాధన వేదిక మండల కన్వీనర్ ఏదునూరి మల్లేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, అనాజిపురం నీటి సంఘం మాజీ చైర్మన్ గునుగుంట్ల శ్రీనివాస్, అనాజిపురం పాల సంఘం చైర్మన్ లక్ష్మి, సిపిఎం మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, జిట్టా అంజిరెడ్డి, కొండాపురం యాదగిరి, ఎదునూరి వెంకటేశు, వడ్డే బోయిన వెంకటేష్ సుర్పంగ ప్రకాష్, ముచ్చపతి బాలయ్య, ఎండి జహంగీర్, అయితరాజు కిష్టయ్య, ముత్యం ప్రకాష్, సిద్దిరాజు, కడారి కృష్ణ, తోటకూరి మల్లేష్, బొల్లెపల్లి పరమేష్ లు పాల్గొన్నారు.