మేడిగడ్డలో మొన్న భారీ బుంగ..

– నిన్న  21వ గేటు ఎత్తివేత..
నవతెలంగాణ – మల్హర్ రావు
అన్నారం బ్యారేజిని మైమరపించే విధంగా కాళేశ్వరం మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజి తయారైంది. అన్నారానికి బుoగలు పడినట్లుగా మెడిగడ్డ బ్యారేజీలోని  20, 21 పిల్లర్ల వద్ద ఇటీవల భారీ శబ్దంతో బుoగ పడిన విషయం తెలిసిందే. దీంతో మెడిగడ్డ బంగారు భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నర్ధకంగా మారింది.ఇది మరవకముందే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. మెడిగడ్డ 7వ బ్లాక్ లో  మొరాయించిన రెండు రేడియల్ గేట్లలో 21వ గేటును శుక్రవారం ఏడ్నిఎస్ఏ అధికారులు ఎత్తివేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7వ బ్లాక్ లో 12వ నెంబర్ నుంచి 22 వరకు మొత్తం 11 గేట్లు ఉన్నాయి. గోదావరి నదికి ప్రవాహం వస్తే మెడిగడ్డ బ్యారేజికి ప్రవాహం లేకుండా ఉండేందుకు అన్ని గేట్లు తెరిచినట్లుగా తెలుస్తోంది. 7వ బ్లాక్ లో 20, 21 పిల్లర్ కుంగి పోవడంతో బారి శబ్దం వచ్చింది. 20వ గెట్ దగ్గర ఏర్పడిన గొయ్యి 20 నుంచి 30 మీటర్ల లోతు 4 నుంచి 5 మీటర్లు ఉన్నట్లుగా ఏడ్నిఎస్ఏ అధికారులు అంచనా వేశారు.గొయ్యిని ఇటీవల తాత్కాలికంగా పూడ్చిన భారీగా వరదలు వస్తే ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. బ్యారేజీ గేట్లు అన్ని పూర్తిగా ఎత్తివేసినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ కారణంతో మరింత నష్టం వాటిల్లే అవకాశం లేకపోదని అధికారులు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మొరాయిస్తున్న 20వ గేటును ముక్కలుగా కట్ చేసి తొలగిస్తే ప్రాజెక్టులోని మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసినట్లుగా అవుతుంది. ఎగువ ప్రాంతంలో 120 పిట్లతో ఏర్పడిన బుoగ 130 మీటర్ల దిగువ ప్రాంతానికి చేరుకునే 300 పిట్ల వరకు విస్తరించినట్లుగా తెలుస్తోంది.