జీపీ కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు పండుగలోపు చెల్లించాలి

The outstanding wages of GP workers should be paid before the festival– లేదంటే  విధులు బహిష్కరిస్తాం..
– కలెక్టర్ కు తేల్చి చెప్పిన కార్మికులు..
– సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామపంచాయతీ కార్మికులకు బకాయిగా ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున సీఐటీయూ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నానంతరం కలెక్టర్ వినతి పత్రం ఇచ్చే సందర్భంలో ముగ్గురు నలుగురు మాత్రమే వెళ్లాలని పోలీసులు సూచించడంతో లేదని అందరం కలిసి వెళ్తామని సుమారు అరగంటకు పైగా ధర్నా తీవ్రం చేయడంతో చివరకు చేసేదేం లేక కలెక్టర్ ను కలిసి ఎందుకు పోలీసులు అనుమతించారు. అందరూ కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేసి, పండగలోపు వేతనాలు ఇవ్వాలని లేదంటే విధులు బహిష్కరిస్తామని కలెక్టర్ కు, సంఘం నాయకులు తేల్చి చెప్పారు. ఇంతకుముందు ధర్నా జరిగిన  కార్యక్రమంలో పాండు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పిన హామీ నేటికీ అమలు చేయలేదని గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలలో అనేక కేటగిరీల వారీగా డ్రైనేజీ,  బిల్లు కలెక్టరుగా కారోబార్లుగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నారని గత ప్రభుత్వం పంచాయతీ కార్మికుల మేడకు ఉరితాడులు బిగించే విధంగా మల్టీపర్పస్ వర్కర్ పేరుతో కేటగిరీలు అన్నింటిని రద్దు చేసిందని అన్నారు.
  కార్మికుల మల్టీ పర్పస్ విధానం వెంటనే రద్దు చేసి, కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మల్టీ పర్పస్ పేరుతో కేటగిరీలు అన్నింటిని రద్దు చేయడంతో చదువు అర్హత సీనియార్టీ ఉన్న కలం పట్టిన కారోబార్ బిల్ కలెక్టర్లు ఆత్మగౌరవం అని దెబ్బతీసిందని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మినెంట్ చేస్తామని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని అధికారం చేపట్టి సంవత్సరం కావస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ రద్దు పిఆర్సి కార్మికులకు గుర్తింపు కనీస వేతనాలు అమలు చేయడం కారోబార్ బిల్ కలెక్టర్ స్పెషల్ స్టేటస్ లాంటి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు.  వెంటనే గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని వేతనాలు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని రెండో పి ఆర్ సి పరిధిలో గ్రామపంచాయతీ సిబ్బందిని తీసుకోవాలని కారోబార్ దిన కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించి పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 51 సవరించాలని మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని పాత కేటగిరీలు అన్నింటిని యధావిధిగా కొనసాగించాలని విలేజి వాటర్ అసిస్టెంట్ గా నియమించి సిబ్బందిని అందరినీ సీనియార్టీని పరిగణంలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇతర శాఖలకు చెల్లిస్తున్న వేతనాలు చెల్లించాలని, విధి నిర్వహణలో ప్రమాదం జరిగి చనిపోయిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ ఐదు లక్షలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని గ్రామపంచాయ సిబ్బంది అందరినీ రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అయిన ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మండల భిక్షం, గడ్డం ఈశ్వర్, నాయకులు మంద యాదగిరి, బాల మల్లయ్య, కిష్టయ్య, రాము, ఎల్లమ్మయ్య, మల్లయ్య, స్వామి, శంకర్, అనిత, అమృత, ఎల్లమ్మ, బుజ్జమ్మ, లక్ష్మి, నరసమ్మ, గోపమ్మ, అందాలు, సరూప, వెంకటమ్మలు పాల్గొన్నారు.