నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్ లోని బండ్లగూడ చౌరస్తా సమీపంలో గత ఐదు రోజులు నుంచి డ్రయినేజీ పొంగి పొర్లుతూ రోడ్డుపై ప్రవహిస్తుందని కాలనీవాసులు వాపోతు న్నారు. సంబంధిత శాఖ సిబ్బంది సమస్య పరిష్కరించడంలో ప్రయత్నాలు చేసినా విఫలం చెందుతున్నారని అంటున్నారు. మూ డు రోజులుగా ఇంటి ప్రధా న ద్వారం ముందుగా డ్రయి నేజీ పొంగి పొల్లడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నా మని డివిజన్‌లోని ఓ ఇంటి యజమానురాలు కలమ్మ వాపోయారు. అదే ఇంట్లో ఉంటూ కూరగా యలు , పూల వ్యాపారం నిర్వహించు కుంటూ జీవనోపాధి పొందుతు న్నానని, అయితే మూడు రోజులుగా కూరగాయలను కొనుగోలు చేయడం కోసం ఇటువైపు ఎవరు కూడా రావ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొంగుతున్న నీరు పూర్తిగా మురికి నీరు కావడంతో దుర్వాసన వెదజల్లు తున్నదని, దాంతో వండిన ఆహారాన్ని కూడా తినలేక పోతు న్నామని వాపోయారు. సంబంధిత శాఖ సిబ్బంది వచ్చి చూసి పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆమె పేర్కొన్నారు. 5 రోజులుగా డ్రయినేజీ పొంగడంతో ఆ రోడ్డు అంతా మురికి నీటితో జల మయంగా మారింది. దీంతో వాహనాలు తిరగడంతో బురదమయమై దుర్వాసన వస్తూ ఉందని, అదేవిధంగా తాగునీటి సరఫరాలు కూడా కలుషి తమయ్యే ప్రమాదం లేకపోలేదని పరిసర ప్రాంత వాసులు అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతి నిధులు, సంబం ధిత అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించి తమ ఆరోగ్యాలను కాపాడాలని పరిసర ప్రాంత వాసులు కోరుతున్నారు.