– ఆస్తుల అటాచ్ మెంట్ కాదు, మొత్తం మేనేజ్ మెంట్ బి క్యాటగిరీ, ఎన్ఆర్ఐ సీట్లుకు తీసుకున్న ఫీజులపై విచారణ జరిపించాలి..
– మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై సిబిఐ, ఈడి విచారణ జరిపించాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్..
నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో 12 ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పీజీ మెడికల్ సీట్లలో బ్లాక్ చేసి మూడింతల ఫీజులకు సీట్లు అమ్ముకుని మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని 2022లో హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసును స్వీకరించి ఈ డి కేసులు నమోదు చేసింది. నేడు మల్లారెడ్డి, చల్మెడ , ఎంఎన్ఆర్ ప్రైవేట్ మెడికల్ కళాశాల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడి నిర్ణయించడాన్ని ఎస్ఎఫ్ఐ స్వాగతిస్తుంది. అలాగే మరో 9 ప్రైవేట్ కళాశాలపై కూడా విచారణ జరిపించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. వారి తరఫున ఏ.వో.లను, సంబందంలేని వారిని విచారణకు పంపుతున్నారు. వారిని కాకుండా యాజమాన్యాలనే విచారించి, అరెస్ట్ చేయాలి. అలాగే బి కేటగిరీ ఎన్ ఆర్ ఐ సీట్లు, యాజమాన్య సీట్లకు వసూళ్లు చేసిన ఫీజులపై కూడా సిబిఐ, ఈ డీలతో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలపై విచారణ జరిపించాలని, అతని సంబందీకుల విద్యాసంస్థలపై కూడా విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది.