వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చిందని కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజు గౌడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం గుర్తించి అందరి గురించి ఆలోచించే వ్యక్తిగా చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం అవార్డు నివ్వడం మా అందరికీ గర్వకారణంగా ఉందన్నారు. వికలాంగుల మందిరం కలిసి అతనికి అభినందన ప్రోగ్రాం చేస్తున్నాం అని, ఆయన చేస్తున్నటువంటి లక్ష డప్పుల వెయ్యి గొంతుల మహా సంగ్రామానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా నుండి వికలాంగుల మందిరం పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, ముఖ్య నాయకులు లక్ష్మీ నరసవ్వ, రాజవ్వ, రాజనర్సు, నర్సింలు, రమేషు, సింగరేపల్లి బాలరాజువ్వ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మందకృష్ణ మాదిగ చేసిన పనులకు గుర్తింపే పద్మశ్రీ అవార్డు
నవతెలంగాణ – కామారెడ్డి