పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసిన పంచాయతీ కార్యదర్శులు

నవతెలంగాణ-జమ్మికుంట : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్కను హైదరాబాదులోని సచివాలయంలో  తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ నాయకులు  శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పంచాయతీ కార్యదర్శి సంఘం వైస్ ప్రెసిడెంట్, మండలంలోని విలాసాగర్ గ్రామ సెక్రెటరీ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మా పంచాయతీ సెక్రటరీల సంఘం తరఫున వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు మనోహర్ రెడ్డి  తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పంచాయతీ సెక్రటరీల సమస్యలు  ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నైనా పరిష్కారం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ ఏ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, ఆకార సురేష్, వివిధ జిల్లాల అధ్యక్షులు కృష్ణంరాజు, అజయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.