మెగా జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి 

The parties should take advantage of the Mega National Lok Adalat– నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల 
నవతెలంగాణ – కంఠేశ్వర్

ఈ నెల 14న జిల్లాలో నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పేర్కొన్నారు. గురువారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజీమార్గమే రాజ మార్గమని ఏళ్ల తరబడిగా వివిధ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్న కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగపరుచుకోవాలన్నారు. ఇప్పటికే తమపై కోర్టుల ఆదేశాల ప్రకారం 14వ తేదీన మెగా లోక్ అదాలత్ ఉన్న దృష్టా గత నాలుగు ఐదు రోజుల నుండి జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలలోని చౌరస్తాలలో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి స్పీకర్లతో నిర్విరామంగా అనౌన్స్మెంట్ కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఇందులో కేసును ఒక్కసారి పరిష్కరించుకుంటే అందులో కేసు పరిష్కారం అవుతే అట్టి కేసును శాశ్వతంగా కొట్టివేయడం జరుగుతుందన్నారు.