పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లాలి

– తెలంగాణ ఫారెస్ట్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి
నవతెలంగాణ- గజ్వేల్‌: భారత రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకువెళ్లాలని తెలంగాణ ఫారెస్ట్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా బి ఆర్‌ ఎస్‌ పార్టీ యువత అధ్యక్షులుగా వర్గల్‌ మండలం మాజీ అధ్యక్షులుగా నాగరాజును నియమించారు. ఈ సందర్భంగా గజ్వేల్‌ లో వైష్ణవి గార్డెన్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలుపు కోసం యువత నడుము బిగించాలని ఆయన సూచించారు. పార్టీలో నాగరాజు సీనియర్‌ కార్యకర్తగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఆదేశాలతో నాగరాజు జిల్లా యూత్‌ నాయకులు ఎంపిక చేసినట్లు వంటేరు ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. కష్టపడినా ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల్లో యువత పాత్ర కీలకమైందని ఆయన అన్నారు. కెసిఆర్‌ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో ఇంటింటికి వెళ్లేలా యువత కషి చేయవలసిన అవసరం ఉందన్నారు. విషయం నాగరాజు భుజస్కందాలపై వేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షులుగా నియమితులైన నాగరాజు మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిలకు కతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ సిద్దిపేట జిల్లాలో అన్ని స్థానాలు భారీ మెజార్టీతో గెలుస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల్‌ మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు.