
టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పార్టీలో చేరుతున్న వారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. బి ఆర్.టి యు రాష్ట్ర కార్యదర్శి మంచె నర్సింలు ఆధ్వర్యంలో బిఎంఎస్ ఆర్చ్ ఫార్మా సంఘం ప్రతినిధులు బిఆర్ టియు అనుబంధమైన ఆర్చ్ ఫార్మా కార్మిక సంఘంలో చేరారు. వారికి బిఆర్ టి యు రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ.. కండువా వేసీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచే నర్సింలు మాట్లాడుతూ.. బిఎం ఎస్ నుండి నర్సింగోజు నాగరాజు, ఐరేని నర్సయ్య, పల్లె వెంకటేష్, బండోజు కృష్ణమోహన్ చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు ఆర్చ్ ఫార్మా ప్రధాన కార్యదర్శి కిషన్, కోశాధికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.