నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రయాణికురాలు ఆటోలో వెళ్తున్న సమయంలో తన మెడలో నుంచి బైక్ పై వచ్చిన దుండగులు బంగారు గొలుసు తెంపుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం తర్వాత చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లోని రుక్మిణీ ఛాంబర్ వద్ద ఈ సంఘటన జరిగింది. మోపల్ మండలం కులాస్ పూర్ కు చెందిన మహిళ ఆటోలో నిజామాబాద్ వస్తుంది. ఈ నేపథ్యంలో వినాయక్ నగర్ లోని రాజీవ్ విగ్రహం వద్ద కొంత మంది ప్రయాణికులను దించేందుకు ఆటోను నిలిపారు. అక్కడే ఆటోలో ఉన్నా కులస్ పూర్ కు చెందిన మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని బైక్ పై పరారీ అయ్యారు. ఈ మేరకు బాధితురాలు నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ లను సైతం అప్పటికప్పుడు ఉన్న అధికారుల ఆదేశాల మేరకు చూసి దొంగతనానికి పాల్పడ్డ నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలను చేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం దుండగులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేపట్టి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.