మహాత్ముడి మార్గం అనుసరణీయం..

Mahatma's path is followed..– కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్..

– కాంగ్రెస్ పార్టీఆధ్వర్యంలో జాతిపితకు ఘన నివాళి..
నవతెలంగాణ – పరకాల
జాతిపిత మహాత్మా గాంధీ చేసిన అహింసా పోరాటం ఆదర్శనీయమని, ప్రపంచానికంతటికి చాటిన ఘనత మహాత్ముడుదని పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపితకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతి సమగ్రత, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ మార్గం ఆదర్శణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ వంటేరు రామ్మూర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిన్నాలగోనాథ్, చందుపట్ల రాఘవరెడ్డి, పసుల రమేష్, మార్క రఘుపతి గౌడ్, పబ్బ శ్రీనివాస్, లక్కం వసంత, ఉడుత అరుణ్, గొట్టి రమేష్ ,దుప్పటి రాజేష్, మార్క రజనీకాంత్, ఎండి అలీ, సూదమల్ల కిషోర్, ఎండి సాధిక్ పాషా, బొచ్చు జెమిని, అనిల్ ,సుధీర్ బాబు, కిషన్, బొచ్చు కుమార్ తదితరులు పాల్గొన్నారు.