అహింసా మార్గాన్ని అనుసరించాలి

Adilabad– జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
అహింసా మార్గంలో బ్రిటిష్‌ బానిస సంకెళ్ల నుండి భారతదేశాన్ని విడిపించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. డీపీఓ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో సీఐలు సతీష్‌, పెద్దన్న, మార్కండేయ, హరినాథ్‌, జిల్లా పోలీస్‌ సంఘ అధ్యక్షుడు ఎం.విజయ శంకర్‌ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో
వాసవి ఇంటర్నేషనల్‌ క్లబ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్‌ అధ్యక్షుడు శంకర్‌, క్లబ్‌ కోశాధికారి చిలువేరి శ్రీధర్‌, సభ్యులు ఎకిరాల శ్రీనివాస్‌, ఆసిఫాబాద్‌ ఎంఈఓ ఉదయ బాబు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు చిలువేరు వెంకన్న, ఆసిఫాబాద్‌ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రావుల శంకర్‌, నాయకులు రావుల వెంకన్న, ఆదిత్య, గుండా ప్రమోద్‌, కొడిపాక వేణుగోపాల్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు కేశవ్‌ పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో
మున్సిపాలిటీ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్‌ కమిషనర్‌ భుజంగరావు గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిబ్బంది సంతోష్‌, వార్డ్‌ అధికారులు పాల్గొన్నారు.
విశ్రాంత సంఘం ఆధ్వర్యంలో
విశ్రాంత సంఘం ఆధ్వర్యంలో జిల్లా సంఘ భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కరుణాగౌడ్‌ అధ్యక్షతన గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కణచి రమేష్‌, వైద్య వెంకన్న, సూరు, మధుసూదన్‌ గౌడ్‌, సిరాజుల్‌ హక్‌, లింగన్న, వెంకటేశం, సత్తెమ్మ, వరలక్ష్మి పాల్గొన్నారు.
ఎంపీడీఓ కార్యాలయంలో
ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీడీఓ శ్రీనివాస్‌, సిబ్బంది ఆదిత్య పాల్గొన్నారు.
వాంకిడి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాజీ సర్పంచ్‌ తుకారాం, కార్యదర్శి శ్రావన్‌, కాంగ్రెస్‌ కార్యాలయంలో మండలాధ్యక్షుడు గుర్నులే నారాయణ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
జూనియర్‌ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో జూనియర్‌ కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్‌, చంద్రయ్య, సునీల్‌, సంతోష్‌, రామకృష్ణ, వినోద్‌, రవి కిరణ్‌ పాల్గొన్నారు.
తిర్యాణి : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గాంధీజీ జయంతి వేడుకలను ఎంపీడీఓ వేముల మల్లేష్‌, కార్యదర్శి రాజేశ్వరి, ఎంపీఓ సుధాకర్‌ రెడ్డి ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను వారి సేవలకు గుర్తింపుగా శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్‌ తోట లచ్చన్న, కోఆప్షన్‌ సభ్యుడు మసాడి రామన్న, ఉపాధి హామీ మేట్లు చైని కృష్ణ కరునాకర్‌, అల్లాడి రామకృష్ణ, పూజ, సంతోష్‌, జురి రాకేష్‌, పారిశుధ్య కార్మికులు గద్దల నరేష్‌, చిలుక రాములు, రవి, లింగేష్‌ పాల్గొన్నారు.
కౌటాల : మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కోట ప్రసాద్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యదర్శులు పాల్గొన్నారు.
బెజ్జూర్‌ : మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గౌరీ శంకర్‌, గ్రామపంచాయతీ కార్యదర్శి తుకారం, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాచకొండ శ్రీ వర్ధన్‌, మాలీ సంఘం జిల్లా అధ్యక్షులు కే రామకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు, పుల్లూరు సతీష్‌, నేరెళ్ల సంతోష్‌, కిరణ్‌, కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షులు హకీమ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిర్పూర్‌(టి) : గాంధీ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యనారాయణ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరు అహింసా మార్గంలో పయానించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
చింతలమానేపల్లి : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి డిప్యూటి తహసీల్దార్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఆర్‌ఐ విజయకుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్‌, వీఆర్‌ఓ పాల్గొన్నారు.
రెబ్బెన : జాతిపిత మహాత్మాగాంధీ, భారత దేశ రెండవ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రీల జయంతిని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రములొని బస్‌ స్టాండ్‌ సమీపంలోని అండర్‌ పాస్‌ వద్ద స్వాతంత్య్ర సమర యోధులకు జయంతి వేడకలు నిర్వహించారు. అనంతరం స్వీట్స్‌, పండ్లు పంపిణీ చేశారు. ఇందులో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు లావుడ్య రమేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దుర్గం దేవాజీ, టౌన్‌ అధ్యక్షుడు వనమాల మురళీ, మోడెం చిరంజీవి గౌడ్‌, మండల మైనార్టీ అధ్యక్షుడు ఇమ్రోజ్‌, మాజీ సర్పంచ్లు పెద్దలు చెన్న సోమశేఖర్‌, లెండుగురే గంటుమేర, మాజీ ఎంపీటీసీ పెసరి మధునయ్య, మోడెం రాజాగౌడ్‌, వెంకటేష్‌,కార్తీక్‌, బాబాభారు, అజ్మేర గణపతి, దుర్గం నందు, గణేష్‌, తిరుపతి పాల్గొన్నారు. అదే విధంగా గోలేటిలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో టీబీజీకేఎస్‌ యూనియన్‌ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్‌ రాజ్‌ శ్రీనివాస్‌ రావు, ఏరియా కమిటీ సెక్రటరీ మారిన వెంకటేష్‌, సెంట్రల్‌ కమిటీ నాయకులు ఓరం కిరణ్‌, మాంతు సమ్మయ్య, ఆఫీస్‌ ఇన్‌చార్జి వంగ మహేందర్‌, నాయకులు కాయిత స్వామి, దుంపల బాపు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్‌ : ప్రతి ఒక్కరూ గాంధీ అడుగుజాడల్లో నడవాలని ఎంపీడీఓ ఆల్బర్ట్‌ అన్నారు. మండల కేంద్రంలోని కోదండ రామాలయం ఆవరణలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు సత్యనారాయణ, రామన్న, నాగేష్‌, సతీష్‌, సంతోష్‌, శ్రీకృష్ణ, సందీప్‌, బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్‌, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు నాయకులు పాల్గొన్నారు.