భవిష్యత్తుకు బాట.. బడిబాట

నవతెలంగాణ – చండూరు  
పిల్లల భవిష్యత్తుకు  బంగారు బాట.. బడిబాటని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చెర్పించాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపద్యాయుడు చిక్కుళ్ళ రామలింగయ్య   విజ్ఞప్తి చేశారు. మంగళవారం  మండల పరిధిలోని బంగారి గడ్డ   గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ప్రధానోపాద్యాయుడు  బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడిబాట ప్రతిజ్ఞ చేశారు. ప్రధానోపాధ్యాయులు చిక్కుళ్ళ రామలింగయ్య  మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ఉన్నందున గ్రామంలోని అందరు విద్యార్థులు ఇతర గ్రామాలకు వెళ్లకుండా,  ప్రైవేటు పాఠశాలలకు వేలకు వేలు ఫీజులు చెల్లించి వెళ్లకుండా గ్రామ ఉన్నత పాఠశాలలో చేరి పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని కోరారు.ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి  కోటి  ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పారిజాతా దేవి, ఉపాధ్యాయులు టి వెంకటేశ్వర్లు , పి గౌతమి, ఎలిజబెత్, ఎండి ఖైరుద్దీన్, ఝాన్సీ, అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.