అట్టహాసంగా ప్రారంభమైన పెద్దగూడెం జాతర

– వైభవంగా జరిగిన శ్రీ ఆదిశంకర పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం
– భక్తి శ్రద్దలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామం లో శ్రీ శ్రీ శ్రీఅదిశంకర పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి జాతర అట్టహాసంగా ప్రారంభమాయ్యాయి. శనివారం స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవాలకు మండలం లోని పలు గ్రామాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామానికి చెందిన ఉడుతూరి శ్యామ్ సుందర్ రెడ్డి,గీత దంపతులు కళ్యాణమహోత్సవం లో స్వామి వారి సన్నిధిలో కూర్చొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారంఅగ్నిగుండాలు, బోనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోడాక్టర్ శామ్ రెడ్డి లింగారెడ్డి, చెన్ను కోటిరెడ్డి, మాజీ సర్పంచులు కూన్ రెడ్డి మల్లారెడ్డి, దయాల లక్ష్మి పవన్,అచ్చిరెడ్డి,సుబ్బారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చందా నాగిరెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి, ఉడుతరి నారాయణ రెడ్డి, వెంకటయ్య, పోశం కోటిరెడ్డి, దేవాలయ ధర్మకర్త గుర్రం శంకర్ నాగలక్ష్మి.
కూన్ రెడ్డి రాంరెడ్డి, నడ్డి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.