పెన్ను పోయింది

The pen is goneపెన్ను పోయింది
బస్సులో వుండింది
కూరగాయల మార్కెట్‌ కి వెళ్తున్నప్పుడు వుంది
పదే పదే ఫోన్‌ మోగుతుంటే అవతలి వక్తిని
అనుసంధానానికి కొంచం తొందరైంది
బహుశా నాకు తెలిసి అప్పుడే పోయింది
పెన్నంటే జేబుకు పెట్టుకునేదేనా?
గన్ను పట్టుకున్న సోల్జర్‌ లా కనిపించడానికేనా?
పెన్ను పోయింది
రోడ్‌ మీద పడి దుమ్ములో వుందా
బురదలో పడి మట్టితో కప్పెయ్యబడిందా
అయ్యో నా పెన్ను
పెన్నంటే ప్రవహించే అభ్యుదయ భావఝరిి
పెన్నంటే నినదించే విప్లవ సమరభేరి
రేషన్షాపులో
కోటా చిక్కనప్పుడు వాటా దక్కనప్పుడు
బాధలేదు చింతలేదు
ఎప్పుడూ ఆనందసాగరంలా వుప్పొంగే నేను
నిరాశగా
చిన్న చిన్న పదాలతో పెద్దకథలు రాసేది
రాతలు తలరాతలు గుండెకోతలు కవితలు రాసేది
యెన్నో సంక్షోభాల నుండి గట్టెక్కించిన పెన్ను
మరెన్నో నిశిరాత్రుల నుండి ఉదయతీరాలకి
చెరవేసిన పెన్ను నేడు పోయింది
నా వొంట్లోని రక్తంచుక్కల కన్న
నా పెన్నులోని సిరాచుక్కలే మిన్న
అవి నేరగ్రస్త రాజకీయ ప్రక్షాళనకై
– కోటం చంద్రశేఖర్‌, 9492043348